అభివృద్ధి లక్ష్యంగా మార్కాపురం నియోజకవర్గాన్ని తీర్చిద్దామని మార్కాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో 14వ వార్డులో స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడనీ, వారందరు కూడా ఖశ్చితంగా మళ్లీ జగనన్నకే ఓటేస్తారని అన్నారు. టిడిపి నేతలు అధికారంలోనికి వస్తామని కలలు కంటున్నారని అవి ఇప్పట్లో సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసిలు కూడా మరోమారు సీయంగా జగన్మోహన్ రెడ్డి ని గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు లేవన్నారు. పదవితో సేవచేస్తా… తన తల్లిదండ్రుల ఆశయాల మేరకు రాజకీయాల్లోనికి వచ్చి సేవ చేశానే కానీ ఏనాడూ వ్యక్తిగత ఆస్థులను సంపాదించలేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనతోపాటు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
మార్కాపురంలో అన్నా రాంబాబు ఎన్నికల ప్రచారం…
123
previous post