అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఎమ్మెల్యే సమీక్ష.

Advertisements

<p>అనంతపురం నగర ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం&comma; వైద్య సేవల మెరుగుదలపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు&period; స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్‌తో కలిసి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రిని సందర్శించి సూపరింటెండెంట్&comma; వైద్యులు&comma; సిబ్బందితో సమావేశమయ్యారు&period; రోగులకు అందుతున్న వైద్య సేవలు&comma; పారిశుద్ధ్య నిర్వహణ&comma; ఆసుపత్రిలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం&comma; సిబ్బంది సమన్వయంపై సమగ్రంగా సమీక్షించారు&period; ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు&period; ఆసుపత్రి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని&comma; నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు&period; స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రభుత్వ ఆసుపత్రులు ఆదర్శంగా నిలవాలని పట్టాభిరామ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్‌ నేత బండ్ల గణేష్.

రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.

మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.