గుడిలో తీర్థం తీసుకున్న తర్వాత ఇలా చేస్తున్నారా..!

pilgrimage in the temple

Advertisements

&NewLine;<p>ఆలయాలకు వెళ్ళినప్పుడు దైవదర్శనం తర్వాత తీర్థ ప్రసాదాలు అందిస్తుంటారు&period; ఈ తీర్థాన్ని చాలా పవిత్రంగా చూస్తారు&period; అందుకే పూజారి తీర్థం చేతిలో వేయగానే కళ్లకు అద్దుకుని తీసుకుంటాం&period; అయితే పవిత్రమైన తీర్థాన్ని తీసుకునేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి&period; తీర్థంలో పంచామృతాలు&comma; తులసీదళాలు&comma; సుగంధ ద్రవ్యాలు&comma; మంత్ర శక్తి ఉంటాయి&period; పరమ పవిత్రంగా తయారు చేసిన తీర్థాన్ని కేవలం ఒక్కసారి తీసుకోకూడదు&period; మూడుసార్లు తీసుకోవాలి&period; కుడి చేతి కింద ఎడమ చేతిని ఉంచి తీర్థం తీసుకోవాలి&period; ఆ సమయంలో అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అంటూ మంత్రాన్ని జపించాలి&period; ఇలా చేయడం వల్ల ఆరోగ్యం&comma; ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు&period; తీర్థాన్ని తీసుకున్న తర్వాత చాలామంది చేతిని తలకు తుడుచుకుంటారు&period; ఇది సరైన పద్ధతి కాదు&period; ఎందుకంటే తలపై బ్రహ్మ దేవుడు ఉంటాడు&period; తీర్థాన్ని సేవించినప్పుడు మన చేయి ఎంగిలి అవుతుంది&period; కాబట్టి ఎంగిలిని బ్రహ్మదేవుడికి అర్పించినట్లు అవుతుంది&period; అందుకే తీర్థం తీసుకునే ముందు కళ్ళకు అద్దుకుంటే పర్లేదు కానీ తీర్థం తీసుకున్నాక చేతిని తలకు రుద్దకూడదు&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..