ఉంగుటూరు లో ఘనంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహావిష్కరణ

Deen Dayal Upadhyaya statue inaguration

Advertisements

&NewLine;<p>పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని పేదలు&comma; అట్టడుగువర్గాలకు కరుణతో సేవ చేయాలనే ఆయన సందేశం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకమని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ అన్నారు&period; బీజేపీ ఉంగుటూరు అసెంబ్లీ కన్వీనర్ శరణాల మాలతీరాణి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో ఏర్పాటుచేసిన భారతీయ జనసంఘ్ సహవ్యవస్థాపకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి కేంద్రమంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఆవిష్కరించారు&period; అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిశోర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు&period; దీన్ దయాళ్ ఉపాధ్యాయ రూపొందించిన అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు&period; ఈ సందర్బంగా కేంద్రమంత్రి భారతీ పవర్ తెలుగు ప్రసంగం ఆకట్టుకుంది&period; బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ విగ్రహాన్ని చెక్కిన వారు&comma; ఏర్పాటు చేసిన వారు&comma; ఆవిష్కరించిన వారు మహిళలే కావడం గర్వంగా ఉందన్నారు&period; సర్పంచి రాంధే లక్ష్మీసునీత&comma; మహిళామోర్చా రాష్ట్రాధ్యక్షురాలు నిర్మలా కుమారి&comma; మైనార్టీమోర్చా రాష్ట్రాధ్యక్షుడు బాజీ&comma; మధుకర్ తదితరులు పాల్గొన్నారు&period; ఈకార్యక్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిని పొత్తులపై వివరాలు కోరగా అతిత్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్