టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్:
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు(Chandrababu) సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కృష్ణప్రసాద్(Krishna Prasad) కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు(Chandrababu) టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు, ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై, సీఎం జగన్(Jagan) పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు.
ఇది చదవండి: మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..?
తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే చంద్రబాబును(Chandrababu), లోకేశ్(Lokesh) ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు, మైలవరం ఎమ్మెల్యే(MLA) టికెట్ ను దేవినేని ఉమాకు కాకుండా వసంత కృష్ణప్రసాద్(Krishna Prasad) కు చంద్రబాబు(Chandrababu) కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.