Thursday, March 12, 2026
News Navigation

Breaking

Thursday, March 12, 2026
Home Andhra Pradesh ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయం..

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయం..

by Rama
Election Comission

ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను హెచ్చరించింది. వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా పార్టీలు వ్యవహరించరాదని… మతం, భాష, సామాజికవర్గం ప్రాతిపదికన ఓట్లు అడిగే ప్రయత్నం చేయవద్దని పార్టీలకు స్పష్టం చేసింది. ప్రచారం కోసం ప్రార్థనా మందిరాలను వాడుకోవద్దని పేర్కొంది. ప్రచారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటర్లను మోసగించేలా తప్పుడు ప్రకటనలు చేయరాదని ఈసీ వెల్లడించింది. అవాస్తవ ప్రకటనల జోలికి వెళ్లొద్దని, ముఖ్యంగా, సోషల్ మీడియాలో జాగ్రత్తగా వ్యవహరించాలని హితవు పలికింది. రాజకీయ ప్రత్యర్థులను దూషించే పోస్టులు, వారిని అవమానించే పోస్టులు పెట్టరాదని స్పష్టం చేసింది. ఇక, గతంలో నోటీసులు అందుకున్న ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఎన్నికల ప్రచారంలో విభజనవాదం, వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని… సమస్యలే అజెండాగా ఎన్నికల్లో ప్రచారం సాగించాలని, సుహృద్భావ వాతావరణంలో రాజకీయ చర్చలను ప్రోత్సహించాలని వివరించింది. ఎన్నికల కోడ్ ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Follow us on :FacebookInstagramYouTube & Google News

ఇది చదవండి: భూమిలేని పేదలకు సీఎం జగన్ గుడ్‌ న్యూస్


సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు …
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. కోడూరు మండల కేంద్రంలోని …
తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్‌లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు
తిరుపతి నగరంలోని ఎయిర్ బైపాస్ రోడ్‌లో ఉన్న డి మార్ట్ స్టోర్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.