బృహదీశ్వరాలయం

Brihadeshwaralayam

Advertisements

&NewLine;<p>ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి&comma; పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు&period; ఈ ఆలయంలో శిల్ప కళ అద్బుతం&period; దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు&period; బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం&period; ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు&period; ఇది శైవాలయం &lpar;శివాలయం&rpar;&period; దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు&period; ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది&period; భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది ఇది చాల పెద్ద ఆలయం&period; పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది&period; పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు&period; ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం&period; ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది&period; రాజ రాజ చోళుడు క్రీ&period;శ&period; 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు&period; చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది&period; గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం&period; ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి&period; ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు&period;<br><strong>తంజావూరులోని బృహదీశ్వరాలయ గోపురం<&sol;strong> <strong>&colon;<&sol;strong><br>రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు&period; ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు&comma; వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు&period; ఇతడు తండ్రి కంటే ఘనుడు&period; తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని&comma; అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం&period; ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది&period; కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు&period; ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు&period; ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం&comma; గర్బ గుడిలోని 13&period;5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం&comma; ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ&period; అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం&comma; భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం&comma; పార్వతీ సమేత శివుని శిల్పం&comma; మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు&comma; ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి&period; రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది&period; ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే&period; ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు&period; ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి&period; ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు&period; ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..