కరీంనగర్ ఎంపీగా విద్యావంతుడు… ప్రజల బాధలు…ప్రయివేట్ ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వ్యక్తి అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ (Boyinapalli Vinod Kumar) గెలిస్తేనే తమ బ్రతుకుల్లో చీకటి తొలిగి.. కొత్త వెలుగులు వస్తాయని… ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోదన్ననే ఎంపీగా గెలిపిస్తామని ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని ప్రయివేట్ విద్యాసంస్థల 40 వేల మంది ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మంగళవారం కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ట్రస్మా ముఖ్య సలహాదారుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విద్యా పన్ను కట్టడం జరుగుతుందని, ఇప్పటి వరకు 11 లక్షల వేల కోట్లు విద్యాపన్ను రూపంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేశాయని పేర్కొన్నారు. ఈ పన్ను ద్వారా వసూలు చేసిన డబ్బులు విద్యా వ్యవస్థకు ఖర్చు పెట్టాలని అన్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు 10లక్షల ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.చాలీచాలని వేతనాలతో ప్రయివేట్ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2018లో కరీంనగర్ ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు చట్టం కోసం పార్లమెంటు లో ప్రయివేట్ బిల్లుకు ప్రతిపాదన చేశారు.ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా హెల్త్ రీయింబర్స్ మెంట్ కల్పించాలని పేర్కొన్నారు. దేశంలోని 18 లక్షల మందికి ఎన్ఐ ఓఎస్ ద్వారా డీఎల్ఈడీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగౌడ్, రమేష్, రవిందర్ రెడ్డి, మధుసూదన్, రవి, రాజుయాదవ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి