కరీంనగర్ ఎంపీగా విద్యావంతుడు… ప్రజల బాధలు…ప్రయివేట్ ఉపాధ్యాయుల సమస్యలు తెలిసిన వ్యక్తి అయినటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ (Boyinapalli Vinod Kumar) గెలిస్తేనే తమ బ్రతుకుల్లో చీకటి తొలిగి.. కొత్త వెలుగులు వస్తాయని… ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బోయినపల్లి వినోదన్ననే ఎంపీగా గెలిపిస్తామని ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యం చేస్తామని ప్రయివేట్ విద్యాసంస్థల 40 వేల మంది ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాలు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మంగళవారం కరీంనగర్ లోని మైత్రి హోటల్ లో ట్రస్మా ముఖ్య సలహాదారుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విద్యా పన్ను కట్టడం జరుగుతుందని, ఇప్పటి వరకు 11 లక్షల వేల కోట్లు విద్యాపన్ను రూపంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేశాయని పేర్కొన్నారు. ఈ పన్ను ద్వారా వసూలు చేసిన డబ్బులు విద్యా వ్యవస్థకు ఖర్చు పెట్టాలని అన్నారు. ప్రయివేట్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులకు 10లక్షల ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.చాలీచాలని వేతనాలతో ప్రయివేట్ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
2018లో కరీంనగర్ ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు చట్టం కోసం పార్లమెంటు లో ప్రయివేట్ బిల్లుకు ప్రతిపాదన చేశారు.ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగా హెల్త్ రీయింబర్స్ మెంట్ కల్పించాలని పేర్కొన్నారు. దేశంలోని 18 లక్షల మందికి ఎన్ఐ ఓఎస్ ద్వారా డీఎల్ఈడీ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉచితంగా శిక్షణ ఇప్పించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగౌడ్, రమేష్, రవిందర్ రెడ్డి, మధుసూదన్, రవి, రాజుయాదవ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
- కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా చోటుచేసుకున్న పరిణామాలపై క్రమశిక్షణా కమిటీ దృష్టి సారించింది. ఇప్పటికే కొండా సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించిన వీడియోలు, అందుబాటులో ఉన్న ఇతర అంశాలను కమిటీ పరిశీలించినట్లు…
- ‘తెలంగాణ రైజింగ్’కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి.లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘తెలంగాణ రైజింగ్’ లక్ష్యాలకు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కోరారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి లండన్‌లోని స్థానిక…
- గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న కూలిపోయిన భవనం పక్కనే పాక్షికంగా దెబ్బతిన్న మరో అక్రమ నిర్మాణం ఉండగా.. బాహుబలి క్రేన్ సహాయంతో దాన్ని కూడా కూల్చివేస్తున్నారు. అక్రమంగా నిర్మించిన ఇలాంటి భవనాలను మున్సిపల్, హైడ్రా అధికారులు నిశితంగా…