68
అనంతపురం జిల్లాకు చంద్రబాబు రానున్నారు. టీడీపీకి కంచుకోటలాంటి ఉరవకొండ నియోజకవర్గంలో రా.. కదిలిరా సభలో పాల్గొనబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎల్ఇడి స్క్రీన్లు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.