ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఐదు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ తో జత కలిసి సీఎం కావాలని చంద్రబాబు కలలు కంటున్నాడని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం జరిగిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. చంద్రబాబు ఒక పక్క పవన్, ఇంకోపక్క కాంగ్రెస్, మరోకపక్క బీజేపీని పెట్టుకుని ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దపడుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని ఎద్దేవా చేశారు. అందరూ కలిసినా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. రెండు ఎకరాల ఆసామి ఇప్పుడు నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడని నల్లపురెడ్డి ప్రశ్నించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో ఓటుకు రెండు నుంచి ఐదువేల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఇస్తున్న డబ్బులు తీసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆసరా కార్యక్రమానికి వచ్చిన మహిళలను ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు.
కలలు కంటున్న చంద్రబాబు
96
previous post