Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..

మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్..

by Rama
nirmala sitaraman

పేదల ఆశలు, మధ్యతరగతి ఆకాంక్షలు, వ్యాపారవర్గాల భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2014లో దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. అందుకే భారీ మెజార్టీతో తమ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారని నిర్మలా సీతారామన్ అన్నారు. సంస్కరణ పథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారని తెలిపారు. సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. పేదలు, మహిళలు, రైతులు, యువకులకు న్యాయం చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు. కరోనా సంక్షోభం నుంచి ఈ దేశం విజయవంతంగా అధిగమించిందని తెలిపారు. తమ సమ్మిళిత వృద్ధి ఆలోచనా విధానం గ్రామస్థాయికి చేరి సక్సెస్ అయిందన్నారు. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరిందని చెప్పుకొచ్చారు. ఆత్మనిర్భర్ భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారని, దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

019463
Total views : 90758

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.