ఏలూరు జిల్లా(Eluru District) పెదవేగి మండలం గోపన్నపాలెం(Gopannapalem)లో వైసీపీ(YCP), కాంగ్రెస్ నేతల(Congress leaders) మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ కార్యకర్తల దాడిలో కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు గాయాలు తగిలాయి. ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో కాంగ్రెస్ ప్రచార వాహనంపై వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం ధ్వంసం అయింది. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. గంగన్నగూడెం రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. కనీసం మహిళలని చూడకుండా వైసీపీ నేతలు తమపై దాడికి పాల్పడ్డారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపణలు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.