సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) :
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఓడించాలని మోడీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. డిసెంబర్లో ఒక దొంగను ఓడగొట్టామని సెటైర్ వేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీఐ పరిశ్రమను మోడీ, కేడీ కలిసి మూయించారని… త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీ ఓపెనింగ్ చేయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని.. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
- ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..ఒకే విద్యార్థినిని నాలుగు సార్లు ఎలుక కరిచింది. సీరియస్ కావడంతో విద్యార్థినిని ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఖమ్మం నగరానికి సమీపంలోని రఘునాధపాలెం బీసీ గురుకుల పాఠశాలలో ఈఘటన జరిగింది. కీర్తి అనే విద్యార్థిని పలు మార్లు ఎలుక…