సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) :
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ, కేసీఆర్ విషం కక్కుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌లో నిర్వహించిన జన జాతర సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఓడించాలని మోడీ, కేసీఆర్ కక్ష కట్టారని ఫైర్ అయ్యారు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలేనని విమర్శించారు. డిసెంబర్లో ఒక దొంగను ఓడగొట్టామని సెటైర్ వేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సీసీఐ పరిశ్రమను మోడీ, కేడీ కలిసి మూయించారని… త్వరలోనే తిరిగి సీసీఐ పరిశ్రమను రీ ఓపెనింగ్ చేయిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఐదింటిని అమలు చేశామని.. త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. పేదలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామన్నారు. పేదల ఇళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగులు నింపుతోందని.. ఈ వెలుగులు ఆపాలనే కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో విచిత్ర ఘటన.సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఓ విచిత్రకరమైన ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా నేరస్తులు, ఖైదీలకు వేయాల్సిన సంకెళ్లను ఏకంగా పోలీస్ స్టేషన్ ప్రధాన గేటుకే వేసిన దృశ్యాలు ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఠాణా ప్రాంగణంలోకి ఇతర వాహనాలు, అనధికార…
- హైడ్రా, రంగనాథ్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు.హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లోతుకుంట ప్రాంతంలోని భూవివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంలో హైకోర్టు ఈ కీలక హెచ్చరికలు జారీ చేసింది. లోతుకుంట పరిధిలోని…
- నీట్ పేపర్ లీకేజీపై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పీడీఎస్‌యూ డిమాండ్.నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో పీడీఎస్‌యూ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.…