కోరికలు నెరవేర్చే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా..!

Parvati Jadala Ramalingeswara Swamy Temple

Advertisements

&NewLine;<p>పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణాలో మిని శ్రీశైలంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇక్కడ కొలువై ఉన్న పరమశివుడు భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే ముక్కొటిగా ఆయురారోగ్యాలను ప్రసాదించే భోళా శంకరుడిగా&period; సంతానాన్ని నెరవేర్చే సంతానేశ్వరుడిగా పేరుగాంచాడు&period; చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి జాతర అద్భుతంగా జరుగుతాయి&period; ఐదు రోజుల పాటు సాగి జాతరను తిలకించేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిస్తారు&period; నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడెం గ్రామానికి కిలో మీటర్ దూరంలో చెర్వుగట్టుపై పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది&period; ఇక్కడికి ప్రతిరోజూ స్వామివారిని దర్శించుకోవడం కోసం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు&period; అడిగిన వెంటనే భక్తుల కోరికలు తీరుస్తూ పూజలందుకుంటున్నాడు&period; స్వామివారు కొండ గుహలో భక్తవత్సలుడుగా కొలువై ఉంటాడు&period; అందుకే భక్తులు గుండ్లపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తప్పనిసరిగా క్షీరాభిషేకం చేస్తారు&period; భక్తుల కోరికలు నెరవేర్చే భోళా శంకరుడిగా&comma; సంతానం ప్రసాదించే సంతానేశ్వరుడిగా పేరుగాంచిన ఆ ముక్కోటి ని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు&period; కామధేనువు విషయంలో తండ్రి జమదగ్ని మహర్షిని అదును చూసి చంపిన కర్త్యా వీరార్జునుడిని సంహరించిన తర్వాత పరశ రాముడు పాప ప్రక్షాళన కోసం దేశమంతా 108 శివలింగాలను ప్రతిష్టించారు&period; అలా ప్రతిష్టించిన ఆ 108 వ లింగమే చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరుడి ఆలయమని పురాణాలు చెబుతున్నాయి&period; అందుకే శివరాత్రి మహాపర్వదినం రోజున ఇక్కడకు వేలాదిగా భక్తులు తరలివస్తారు&period; శివమాలలు వేస్తారు&period; లింగ ప్రతిష్టాపనలో భాగంగా పరశురాముడు వేల సంత్సరాలు తపస్సు చేస్తాడు&period; ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపోద్రిక్తుడై లింగం మీద గొడ్డలితో ఒక దెబ్బ వేస్తాడు&period; భక్తుడి కోరిక మేరకు శివుడు ప్రత్యక్షమై కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తానని హామీ ఇచ్చాడని అనంతరం పరుశురాముడు అక్కడే శివైక్యం చెందాడని పురాణాలు చెబుతున్నాయి&period; నల్గొండ జిల్లాలో కొలువైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఓ ప్రత్యేక విశిష్టత ఉంది&period; క్షత్రియ సంహారం అనంతరం పాప ప్రక్షాళన కోసం పరశురాముడు ప్రతిష్టించిన 108 శివలింగాలలోచివరి లింగమని పురాణాలు చెబుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..