రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని తిమ్మారెడ్డి గూడ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామ ఆడపడుచులు బోనాలను ఎత్తుకొని పోతురాజుల విన్యాసాలతో అమ్మ వారి టెంపుల్ వరకు కాలినడకన వెళ్లి బోనాలను సమర్పించడం జరిగింది. అనంతరం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అనంతరం మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మాట్లాడుతూ… ఎల్లమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని పాడిపంటలను కాపాడడానికి ఈ తల్లి ఉన్నదని ఎన్నో పురాతన కాలం నుంచి ఈ గుడి ఇక్కడ ఉందని కానీ గత మూడు సంవత్సరాల నుంచి కొత్తగా గుడినీ పునర్ నిర్మించామని అప్పటినుంచి ప్రతి సంవత్సరం కల్యాణాన్ని నిర్వహిస్తామని ఈ కళ్యాణం ఇంకా రెండు సంవత్సరాల వరకు నిర్వహిస్తామని తెలిపారు. విత్తనాలు వేసే సమయంలో ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేస్తామని అలాగే పంట చేతికి వచ్చినప్పుడు కూడా పంట కోయడానికి ముందు ఎల్లమ్మ తల్లికి మొక్కి పంట కోస్తామని ఈ తల్లి దయవల్ల మంచి దిగుబడి వస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు,గ్రామ ప్రజలు బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..