రాష్ట్ర జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విశాఖపట్నంలో అక్రమ అరెస్టుకు నిరసన తెలియజేసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. ఎంపీ స్వార్థానికి రోడ్డు మూసేయటం పై నిరసన తెలపడానికి వెళ్లిన నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం పై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వారిపై కేసును ఎత్తి వేయకపోతే ఛలో విశాఖపట్నం చేపడతామన్నారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తుంగలో తొక్కుతున్నారని, ప్రభుత్వం అంటే ప్రజలకు అవసరమైన సమస్యలను తీర్చడం కానీ ఇలా వారి అవసరాల కోసం రోడ్లను సైతం మూసివేసి సైకో పాలన చేస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే 2024లో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
రాష్ట్రంలో దుర్మార్గ పాలన….
89