77
తెలుగుదేశం పార్టీ – జనసేన పార్టీ ఉమ్మడి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె పిలుస్తుంది రా.. కదలిరా కార్యక్రమాల్లో భాగంగా భోగి పండుగ సందర్భంగా పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల ఫోటోలను, వైసీపీ తెచ్చిన చీకటి జీవోలను “కీడు తొలగాలి – మేలు జరగాలి” అంటూ జీవో కాపీలను భోగిమంటల్లో వేసి దహనం చేశారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న జలగాసురుడి నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి చెయ్యమని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.