కొత్త పింఛన్ల కోసం హెచ్‌ఐవీ బాధితుల ఎదురుచూపులు..

hiv victims

Advertisements

&NewLine;<p>కొత్త పింఛను మంజూరు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50వేల మంది హెచ్‌ఐవీ బాధితులు రెండేళ్ల నుంచి నిరీక్షిస్తున్నారు&period; వీరిలో కొందరు పింఛను రాకుండానే కన్నుమూస్తున్నారు&period; మరోవైపు పింఛను అందుకునేవారిలో కొందరు అనర్హుల జాబితాలో చేరుతున్నారు&period; ఈ పరిణామాలు హెచ్‌ఐవీ బాధిత కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి&period; వ్యవసాయ కూలీలు&comma; వాచ్‌మెన్‌లు&comma; పారిశుద్ధ్య కార్మికులు&comma; ఇతర చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించే వారిలోనే హెచ్‌ఐవీ బాధితులు ఎక్కువగా ఉన్నారు&period; పనిచేయాలన్నా ఇలాంటి వారికి శరీరం సహకరించదు&period; ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా తోడ్పాటును అందించే పింఛను కూడా రాకపోవడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు&period; దరఖాస్తు చేసుకున్నవారిలో 60శాతం మహిళలే ఉన్నారు&period; వన్‌ పెన్షన్‌ విధానంలో కొంతమందిని విద్యుత్తు వాడకం&comma; సొంతిల్లు&comma; ఇతర నిబంధనల అమలుతో లబ్ధిదారులు తగ్గిపోతున్నారు&period; బాధితుల్లో వితంతువులు ఉన్నట్లయితే వీరికి ఆ పింఛన్‌తోపాటు ఇదికూడా వచ్చేది&period; ఆధార్‌ సాయంతో రెండుచోట్ల ప్రయోజనం పొందుతున్నారన్న ఉద్దేశంతో కొందరి పేర్లను తొలగిస్తున్నారు&period; సుమారు 35వేల మందికి పింఛను అందుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..