రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన ఆవుల మల్లేష్(38) తన భార్య ఆవుల నవనీత (32) నవనీత మేనమామ కు ఆపరేషన్ జరగడంతో చూడడానికి లంగర్ హౌస్ లో ఉన్న హాస్పిటల్ కి వెళ్తున్న క్రమంలో చేవెళ్ల మల్లారెడ్డి గూడ గేట్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన షిఫ్ట్ కార్ ఢీకొట్టడంతో అవుల నవనీత అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మల్లేష్ కి తీవ్ర గాయాల కావటంతో అక్కడున్నవారు వెంటనే ఆంబులెన్స్ లో చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం నగరానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన నవనీతకు ఒక బాబు (7), ఒక పాప(11) ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మల్లారెడ్డి గూడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
82
previous post