రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని బొబ్బిలిగామ గ్రామానికి చెందిన ఆవుల మల్లేష్(38) తన భార్య ఆవుల నవనీత (32) నవనీత మేనమామ కు ఆపరేషన్ జరగడంతో చూడడానికి లంగర్ హౌస్ లో ఉన్న హాస్పిటల్ కి వెళ్తున్న క్రమంలో చేవెళ్ల మల్లారెడ్డి గూడ గేట్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన షిఫ్ట్ కార్ ఢీకొట్టడంతో అవుల నవనీత అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మల్లేష్ కి తీవ్ర గాయాల కావటంతో అక్కడున్నవారు వెంటనే ఆంబులెన్స్ లో చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం నగరానికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన నవనీతకు ఒక బాబు (7), ఒక పాప(11) ఉన్నారు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు నడిపిన వ్యక్తి పరారీలో ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ranga reddy crime news
రంగారెడ్డి జిల్లా(Ranga Reddy) చేవెళ్ల…
చేవెళ్ల నియోజకవర్గం, ఆలూరు విద్యుత్ సబ్ స్టేషన్ లోని ఆపరేటర్ వర్థ్య హర్యా (40) హత్యకు గురయ్యాడు. డబ్బుల కోసం దుండగులు విధి నిర్వహణలో ఉండగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో హత్య చేశారు. హత్య చేసిన అనంతరం అతడి వద్ద ఉన్న సబ్ స్టేషన్ ఫోన్, పర్సనల్ ఫోన్లు తీసుకెళ్లారు. హర్యా ది శంకర్ పల్లి మండలంలోని మోకీల గ్రామం. ఇతడు ఆలూరు సబ్ స్టేషన్ లో గత రెండు సంవత్సరాలు గా ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Follow us on :Facebook, Instagram&YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండల కేంద్రంలోని బాకారం గ్రామ రెవెన్యూ పరిధిలో డ్రీమ్ వ్యాలి సమీపంలోని గుర్తు తెలియని మహిళా కాలుతున్న మృతదేహాన్ని గమనించిన చుట్టూ ప్రక్కన వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే మొయినాబాద్ సీఐ పవన్ కుమార్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని చేవెళ్ల ఏసిపి ప్రశాంత్ రెడ్డి కీ సమాచారం ఇవ్వడంతో ఏసిపి ప్రశాంత్ రెడ్డి అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం క్లూస్ టీంకు మరియు డాగ్స్ స్క్వాడ్ సమాచారం ఇచ్చి పరిశీలించడం జరిగిందని తన ప్రాథమిక దర్యాప్తులో తెలిపిన విధంగా ఎక్కడో ఈ అమ్మాయిని చంపి ఇక్కడ తీసుకొచ్చి ఈ రోజు మూడు గంటల ప్రాంతంలో తగలబెట్టినట్టు ఏసిపి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మృతదేహం దగ్గర ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని అప్పటికే పూర్తిగా కాలిపోయి ఉన్నట్లు గుర్తించామని అమ్మాయి లోతుస్తులు మాత్రమే ఉన్నాయని జడకు మాత్రం రెడ్ క్లిప్ ఉన్నట్టు ఏసిపి దర్యాప్తులో తెలిసినట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించామని అక్కడ ఒక రోజు వేచి చూసిన అనంతరం పోస్టుమార్టం నిర్వహిస్తామని ఆ తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని మీడియా తొ తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.