85
వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. అందుకే వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని జగన్ తెలిపారు. ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలనే మా తపన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులకున్న భూమి అర హెక్టారు లోపేనని జగన్ తెలిపారు.