ఏపీ సీఎం జగన్ వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధులను విడుదల చేశారు. రైతుల ఖాతాల్లోకి ఒక వేయి 78 కోట్ల నగదును బదిలీ చేశారు. రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని జగన్ అన్నారు. గత 57 నెలల్లో రైతు భరోసా రూపంలో 34 వేల 288 కోట్లు అందించామని వెల్లడించారు. ఈ పథకం కింద 54 లక్షల మంది లబ్ది పొందుతున్నారని సీఎం జగన్ తెలిపారు. తమది రైతు ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ఏపీలో ఒక హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 70 శాతం మంది ఉన్నారని, అర హెక్టారు లోపు భూమి ఉన్న రైతులు 50 శాతం మంది ఉన్నారని… అలాంటి రైతులకు తాము అందించిన పెట్టుబడి సాయం ఎంతో ఉపకరించిందని తెలిపారు. ఇక, అర్హులైన రైతులకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా విడుదల చేసినట్టు సీఎం జగన్ వెల్లడించారు. సుమారు 11 లక్షల మంది రైతులకు సున్నా వడ్డీ రాయితీ కింద 216 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు.
YSR Rythu Bharosa
వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జమ చేశారు. రబీ 2021–22, ఖరీఫ్–2022 సీజన్లకు గాను అర్హులైన రైతు కుటుంబాలకు సున్నా వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. ఈ రెండు పథకాలకు అర్హత పొందిన రైతు కుటుంబాల ఖాతాలకు సాయాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. అందుకే వరుసగా ఐదో ఏడాది రైతు భరోసా అందిస్తున్నామని జగన్ తెలిపారు. ప్రతీ అడుగూ కూడా రైతులు, రైతు కూలీలు బాగుండాలనే మా తపన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 50శాతం లోపు రైతులకున్న భూమి అర హెక్టారు లోపేనని జగన్ తెలిపారు.
అన్నదాతలను అన్నివిధాలుగా ఆదుకునే లక్ష్యంతో జగన్ సర్కార్ రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి అందిస్తున్న రైతు భరోసా నిధుల్ని నేడు విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు.
ఇది చదవండి: టీడీపీ జనసేన సభ గ్రౌండ్ రిపోర్ట్…
వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా రైతులకు ఒక్కొక్కరికి ఏటా 13 వేల 500 చొప్పున వరుసగా 4 ఏళ్ళు సాయం అందించారు. ఐదో ఏడాది” ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి 11 వేల 500 సాయం అందించారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా “వైఎస్సార్ రైతు భరోసా” క్రింద ఏటా 13 వేల 500 రైతు భరోసా సాయం అందిస్తున్నారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 140825