మిగతా సీజన్లలతో పోలిస్తే ఎండాకాలంలో చర్మ సంరక్షణ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలం వచ్చిందటే చాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తేమ స్థాయి అధికమవుతుంది. తేమ మన చర్మం, జుట్టులో అనేక మార్పులు తెస్తుంది. తేమ వల్ల మన చర్మంపై చెమటగా చేరి, జిడ్డుగా మారుతుంది. దీనివల్ల చర్మంపై మంటలు, బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వేడి దద్దులు, శరీర దుర్వాసన వంటి సమస్యలు వస్తాయి.
ఇది చదవండి: భోజనం చేసిన తర్వాత బెల్లం తింటున్నారా..!
మన తలలో కూడా చుండ్రు పేరుకుపోతుంది. వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. రోజూ రెండుసార్లు మంచి నీటితో మీ చర్మాన్ని శుభ్రపరచండి. ఒకవేళ మీకు చెమట ఎక్కువగా వస్తుంటే రోజుకు రెండుసార్లు స్నానం చేయడం మంచిది. స్నానం చేశాక బట్టలు ధరించే ముందు మీ చర్మాన్ని పూర్తిగా తుడుచుకోండి. అంతేకాక, సరిగ్గా ఆరిన బట్టలనే వేసుకోండి. బయటకి వెళ్లే ముందు పౌడర్ జల్లుకోండి.
ఇది చదవండి: రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి కొత్త లాలాజల పరీక్ష…
ఎందుకంటే, ఇది అధిక తేమను గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, హీటింగ్ సమస్యలను నివారిస్తుంది. హైపర్‌పిగ్మెంటేషన్, చర్మ సున్నితత్వంతో బాధపడేవారు సన్‌స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. వేసవి కాలంలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా అధికమవుతుంటాయి. వీటిని అరికట్టేందుకు, వారానికి కనీసం రెండుసార్లు మీ జుట్టును శుభ్రపర్చుకోండి.
ఇది చదవండి: యాలకులు తినడం వలన కలిగే లాభాలు
దురద లేదా చుండ్రు సమస్యతో బాధపడుతున్న వారు యాంటీ డాండ్రఫ్ షాంపూని క్రమం తప్పకుండా ఉపయోగించండి. వేసవిలో మీ జుట్టుకు అదే పనిగా నూనె రాయకండి. ఎందుకంటే, ఇది మాడు సమస్యలకు దారితీస్తుంది. దీనికి బదులు వారానికి ఒకసారి నూనె రాసుకుంటే సరిపోతుంది. షాంపూ రాసిన గంట లేదా రెండు, మూడు గంటల తర్వాత తలస్నానం చేస్తే మంచిది. పై చర్యలు పాటించినా సరే, మీకు చర్మం, జుట్టుకి సంబంధించిన సమస్యలు వస్తుంటే, చర్మవ్యాధి నిపుణులని సంప్రదించండి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.