Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Telangana ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో మలుపు..

ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో రోజుకో మలుపు..

by Rama
Drugs

గచ్చిబౌలి ర్యాడిసన్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తోన్న క్రమంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన డ్రగ్‌ సరఫరాదారుడిగా ఉన్న మీర్జా వహీద్‌ బేగ్‌ను పోలీసులు విచారించి, రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు పొందుపర్చారు. స్నాప్‌చాట్‌లో చాటింగ్‌ చేస్తూ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గత నెల 29న బేగ్‌ను అరెస్టు చేసి అతని వద్ద 3.58 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో 10 సార్లు బేగ్‌ డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇందులో క్రిష్‌ పేరును మరోమారు ప్రస్తావించారు. బేగ్‌ నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేసేందుకు రెండు దఫాల్లో నిందితులు అతనికి రూ.30వేలు గూగుల్‌ పే ద్వారా చెల్లించారు. ఫిబ్రవరి 24న జరిగిన పార్టీలో 10 మంది పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు లిషిత, నీల్, సందీప్‌, శ్వేత ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరందరికీ నోటీసులు అందినా ఎలాంటి స్పందనలేదు. నీల్‌ విదేశాలకు పారిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులు శతవిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. దర్శకుడు క్రిష్‌ సోమవారం మరోసారి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.

ఇది చదవండి: దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించాం..


హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార …
కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.
నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన …
ఈత సరదా అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి..
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. తెలంగాణవాసి అనురూప్‌ రెడ్డి ..ముగ్గురు స్నేహితులను కాపాడి..అనూహ్య రీతిలో …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019441
Total views : 90721

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.