తెలంగాణ నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం మరెవరూ నామినేషన్ వేయకపోవడంతో గడ్డం ప్రసాద్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించాలని అక్బరుద్దీన్ కోరారు. ప్రొటెం స్పీకర్ ఆహ్వానం మేరకు స్పీకర్ గా గడ్డం ప్రసాద్ బాధ్యతలను స్వీకరించారు. అనంతరం గడ్డం ప్రసాద్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కేటీఆర్ తదితరులు తోడ్కొని వచ్చి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత సభలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన ఛైర్ వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మూడవ శాసనసభ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బాధ్యతలను స్వీకరించారు.
గడ్డం ప్రసాద్ రాజకీయ ప్రస్థానం 2008లో ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓడించిన ఘనత గడ్డం ప్రసాద్ కావడం గమనార్హం. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటి వరకు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2008 ఉపఎన్నిక, 2009లో ఆయన వరుసగా రెండు సార్లు వికారాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో వికారాబాద్ నుంచి కేసీఆర్ పోటీ చేశారు. ఆ ఎన్నికలో కేసీఆర్ పై గడ్డం ప్రసాద్ దాదాపు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2018లో వికారాబాద్ నుంచే ఓటమిపాలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓటమిపాలయినప్పటికీ ఆయన వికారాబాద్ నియోజకవర్గాన్ని వీడలేదు. ఇప్పుడు మళ్లీ వికారాబాద్ నుంచే గెలుపొంది, అత్యున్నతమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని చేపట్టారు. గడ్డం ప్రసాద్ కు భార్య శైలజ, ఇద్దరు సంతానం ఉన్నారు.
నూతన అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్
84
previous post