పవన్ కల్యాణ్‌ను నమ్మి నట్టేట మునిగామని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ ఆయన టికెట్ దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024లో అద్భుతం జరుగుతుందని ఆశించాం.. కానీ స్వార్థపరులతో ప్రయాణించామని అర్థం కాలేదని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని.. తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చి మేం ఆస్తులు అమ్ముకున్నాం.. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆస్తులు కొనుకున్నారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి, కొత్త తరం నేతలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని పోతిన డిమాండ్ చేశారు. పవన్‌ది అంతా నటనేనని, పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్ధ పూరితమన్నారు. పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని పోతిన మహేష్ విమర్శించారు.
గుడ్ బై జనసేన – పోతిన మహేష్
106
previous post