Wednesday, September 23, 2026
News Navigation
Wednesday, September 23, 2026
News Navigation

Breaking

Wednesday, September 23, 2026
Home Andhra Pradesh వైసీపీపై బాలకృష్ణ విమర్శలు…

వైసీపీపై బాలకృష్ణ విమర్శలు…

by Prakash
Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) :

త్వరలో జరిగే ఎన్నికలు మహాసంగ్రామం లాంటివని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యానించారు. కూటమి పార్టీల నాయకులు, కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి కార్యాచరణ, విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వైసీపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చదవండి : వైసీపీ నాయకుల దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.

ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని, మద్య నిషేధం అమలు చేయకుండా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పదేళ్లు వెనక్కు వెళ్లిందన్నారు. ఇలాంటి రాష్ట్రానికి సమర్థమైన పాలన అందించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడి ద్వారానే సాధ్యమని అన్నారు. హిందూపురం అసెంబ్లీ స్థానానికి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తాను హ్యాట్రిక్ సాధిస్తానని అన్నారు. నా అక్కాచెల్లెళ్లు అంటూ సొంత చెల్లెళ్లకే అన్యాయం చేశాడని అన్నారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విశాఖలో కరెన్సీ నోట్ల కుప్ప.
విశాఖపట్నంలో కరెన్సీ నోట్లు కుప్పలుగా కనిపించడం కలకలం రేపుతోంది. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని సెంట్రల్ పార్క్ …
బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తి.
గుంటూరు జిల్లా తెనాలిలో ఆశ్రయం ఇచ్చిన బంధువు ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ …
పుంగనూరులో భారీ వర్షాలకు పెను ప్రమాదం.
అన్నమయ్య జిల్లా పుంగనూరులో భారీ వర్షానికి పెను ప్రమాదం తప్పింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: