పవన్ కల్యాణ్‌ను నమ్మి నట్టేట మునిగామని పోతిన మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పవన్ కల్యాణ్‌తో కలిసి నడిచినందుకు అసహ్యంగా ఉందన్నారు. విజయవాడ వెస్ట్ సీటు ఆశించి భంగపడ్డ ఆయన టికెట్ దక్కకపోవడంతో పార్టీకి గుడ్ బై చెప్పారు. 2024లో అద్భుతం జరుగుతుందని ఆశించాం.. కానీ స్వార్థపరులతో ప్రయాణించామని అర్థం కాలేదని ఫైర్ అయ్యారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని.. తన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ బయటపెడతానని సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చి మేం ఆస్తులు అమ్ముకున్నాం.. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఆస్తులు కొనుకున్నారని ఆరోపించారు. కాపు సామాజిక వర్గానికి, కొత్త తరం నేతలకు పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని పోతిన డిమాండ్ చేశారు. పవన్‌ది అంతా నటనేనని, పవన్ సిద్ధాంతాలు అన్ని స్వార్ధ పూరితమన్నారు. పవన్ గురించి తెలిసే ఆయన్ని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని పోతిన మహేష్ విమర్శించారు.
Pavan Kalayan
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan):
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా వెల్లడించింది. ఇప్పటికే జరగాల్సిన భీమవరం పర్యటన వాయిదా పడగా.. ఇప్పుడు మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల పర్యటనే వాయిదా పడింది.
పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటన వాయిదా వెనుక ప్రభుత్వ హస్తం ఉందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉభయ గోదావరి జిల్లాల పర్యటనకు రాకుండా అధికారుల సాయంతో ప్రభుత్వం అడ్డుకుంటుందని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్ దిగేందుకు అనుమతుల విషయంలో ప్రభుత్వ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారుల ద్వారా అనుమతులకు సాకులు చూపిస్తున్నారు. భీమవరంలో ఇదే ఇబ్బందులు తీసుకురావడంతో పర్యటన వాయిదా వేశారు. కాకినాడలో సమావేశానికి ఆ నగరంలో ఉన్న హెలిపాడ్ కోసం అనుమతి కోరితే అంగీకరించలేదు. అక్కడికి 30 కి.మీ. దూరంలో ఉన్న గొల్లప్రోలులో దిగాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి అవాంతరాలు కల్పిస్తుండటంతో పర్యటన వాయిదా వేయాలని నిర్ణయించారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం కలిగిస్తున్న ఆటంకాలపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పార్టీ లీగల్ సెల్ కు పవన్ కళ్యాణ్ సూచించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేసే తేదీలను త్వరలో వెల్లడిస్తామని జనసేన పార్టీ ప్రకటించిది.
Follow us on : Facebook, Instagram & YouTube.
పర్యటన వాయిదా పడటంతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నాయకులతో భేటీకి ఏర్పాట్లు చేశారు. వాటిని పార్టీ కేంద్ర కార్యాలయంలో చేపడతారని జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. బుధవారం భీమవరం వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో వెళ్లేందుకు జనసేన నేతలు సైతం ఏర్పాట్లు చేశారు. అయితే ఊహించని విధంగా.. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు స్థానిక అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో జనసేనాని భీమవరం పర్యటన వాయిదా పడింది. భీమవరం విష్ణు కాలేజీలో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు హెలిప్యాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కు జనసేన నేతలు దరఖాస్తు చేశారు. అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ కు విద్యుత్, రోడ్డు భవనాల శాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు.
దీనిపై జనసేన నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఇలా చేయిస్తోందని ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం హెలిప్యాడ్కై కలెక్టర్, పోలీసులకు దరఖాస్తు చేసినట్లు జనసేన నేతలు చెప్తున్నారు. కలెక్టర్, పోలీసు శాఖ నుంచి సానుకూల స్పందన వచ్చిందనీ.. అయితే విద్యుత్, ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం అనుమతి ఇవ్వలేదని చెప్తున్నారు. కారణాల ఏవైనా పవన్ పర్యటన మాత్రం వాయిదా పడింది. Read Also..
- విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!by CVR NEWSవిశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ ప్రక్రియను సులభతరం చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం వినియోగదారులకు గ్యాస్ సరఫరా కావడంలేదు. మాడుగులలో గ్యాస్ బుక్ చేసిన వెంటనే వినియోగదారుల మొబైల్…
- నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.by CVR NEWSనంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు గ్రామాల్లో చమురు నిల్వలను గుర్తించేందుకు భారీ స్థాయిలో బోరు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. శాటిలైట్ ద్వారా గుర్తించిన పాయింట్ల ఆధారంగా సుమారు 50 బోరు బావుల…
- రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..by CVR NEWSఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. “ఆకలేస్తుంది అమ్మ… అన్నం పెట్టు” అంటూ నమ్మించి పిలిపించి, కన్నతల్లినే ఘోరంగా హతమార్చాడు ఓ కసాయి కొడుకు. మే 4వ తేదీన ముంజేటి స్పందన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా చెప్పుకోవచ్చు. అత్యధికంగా సామాజిక వర్గంగా కాపులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ భిన్నమైన తీర్పులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2014లో ఇండిపెండెంట్ గా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వర్మ విజయం సాధించారు. ఏకంగా 50 వేల ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. 2019 లో మాత్రం జగన్ గాలికి ఆయన కూడా కొట్టుకుపోయారు. ప్రస్తుతం జనసేన టిడిపి బలంగా ఉన్న వర్గాల్లో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెప్పాలి అయితే ఇక్కడ వర్మ సీటు ఆశిస్తున్నారు. కానీ జనసేనకు పిఠాపురం తప్పనిసరి అని వాదన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్థానికత అంశం కూడా తెరపైకి రావడం రాజకీయంగా కలవరం సృష్టిస్తుంది. ప్రస్తుతం జనసేన ఇన్చార్జిగా ఉన్న ఉదయ శ్రీనివాస్ రాజమండ్రి దగ్గర కడియంకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని జనసేన నాయకుల మధ్య వైరాన్ని తగ్గించేందుకు పార్టీ కార్యక్రమాలు చక్కదిద్దేందుకు మాత్రమే ఉదయ్ శ్రీనివాసన్ పంపించారనేది మరొక వాదన అయితే ఉదయ శ్రీనివాస్ కు సీటు పక్కా అని పవన్ కళ్యాణ్ ఇంట్లో మనిషిగా ఉదయ శ్రీనివాస్ కు పేరు ఉందని ప్రచారం ఎక్కువగా ఉంది. అయితే తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా పిఠాపురం ప్రత్యేక స్థానంలో ఉంది. ఇందుకు గతంలో తెలుగుదేశానికి పడ్డ ఓట్లే ఉదాహరణగా చెబుతున్నారు. జనసేన బలంగా ఉన్నప్పటికీ లోకల్ ఫీలింగ్ బయటకు రావడంతో ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ పరిస్థితి అయోమయంగా మారింది. దీంతో ఇక్కడ సీటును తెలుగుదేశానికి కేటాయించే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క అధిష్టానం కూడా ఎటు తేల్చకపోవడంతో ఈ సీటు ప్రస్తుతం గందరగోళ పరిస్థితిని నెలకొల్పిందనే చెప్పాలి. ఆఖరి నిమిషం వరకు పిఠాపురం సీటు తేల్చాలని ప్రతిసారి ఇలాగే చేసి కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని చెబుతున్నారు. ఆయా పార్టీల అభిమానులు ఎవరో ఒకరికి సీటు వస్తుందని పక్కాగా చెబితే ఆ దిశగా మేము కార్యక్రమాలు చేస్తామని అప్పటివరకు ఈ కన్ఫ్యూజన్ తప్పదని జనసేన టిడిపి కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క వైసీపీ ఇప్పటికే సీట్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేసింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే దొరబాబును పక్కనపెట్టి కాకినాడ ఎంపీ వంగ గీతకు ఇన్చార్జ్ పగ్గాలు అప్పగించారు. పిఠాపురం సీటు విషయంలో ఎమ్మెల్యే మరో దారి లేక పార్టీ వెంటే ఉన్నారు. ప్రస్తుతం పిఠాపురం రాజకీయ పరిస్థితి చూస్తే జనసేన టిడిపి పోటాపోటీగా సీటు కోసం పాకులాడుతున్నాయి. మరోపక్క పిఠాపురం స్థానం నుండి పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అలా జరిగితే ఎవరికీ గొడవ ఉండదని నెగ్గించుకుంటామని టిడిపి జనసేన అభిమానులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే పిఠాపురం సీటు విషయంలో చివరి వరకు డైలమా తప్పదని ఇది గతం నుండి ఆనవాయితీగా వస్తుందని స్థానికులు అంటున్నారు.
ఏలూరులోని స్థానిక 15 వ డివిజన్ లోని ఆముదాల అప్పల స్వామి కాలనీ లో కబ్జా కు గురౌతున్న కామన్ సైట్ ని ఏలూరు జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజుల్లో కాలనీకి సంబంధించి ప్రజల అవసరార్థం మార్కెట్ కానీ, కళ్యాణ మండపం కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించేందుకు రెండు ఎకరాలు కేటాయించడం జరిగిందని, అది కొంతమంది బయట వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని, ఎవరి చేతుల్లో కూడా ఆక్రమణకు గురవకుండా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, తగు చర్యలు తీసుకునేలా ఒత్తిడి తీసుకొని వస్తామని, ఆక్రమణకు గురవుతున్న ఈ స్థలాన్ని, అందరికీ ఉపయోగపడేలా జనసేన పార్టీ పేదల పక్షాన ఉంటుందని తెలియజేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ తగు చర్యలు తీసుకోని పక్షంలో జనసేన ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాలలో పిఠాపురం మొదటి స్థానంలో ఉందని చెపుతారు. నిజంగా పార్టీ ఇక్కడ బలంగా ఉంది. కానీ గత కొంతకాలంగా అసమ్మతి పెరిగింది. తొలుత పిఠాపురం ఇన్చార్జిగా మాకినీడి శేషు కుమారి వ్యవహరించారు. హఠాత్తుగా ఆమెను తొలగించి పార్టీ అధినేత పవన్ కు సన్నిహితుడైన టీడీపీ అధినేత తంగేళ్ల ఉదయ శ్రీనివాసును నియమించారు. ఆయన రావడంతోనే ఆమె రాజీనామా చేసి వెళ్లిపోయారు. కొంత కాలం పాటు ఉదయ శ్రీనివాస్ కార్యక్రమాలు సాఫీగానే జరిపారు. ఇదే పార్టీలో సీనియర్లను గుర్తించడం లేదని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ పిల్లా శ్రీధర్, అదే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు వచ్చినప్పుడు గొల్లప్రోలులో ఆయన బస చేసిన ఇంటి అధినేత, విద్యావేత్త, సీనియర్ నేత ఇలా ఎందరినో తంగిళ్ళ పట్టించుకోవడం లేదు. వారంతా పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ ప్రాధాన్యత లేదని వాపోతున్నారు. మరోపక్క టీడీపీ ఇన్చార్జి వర్మ తానే అభ్యర్థని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరినీ కలుపుకొని పోవలసిన ఉదయ శ్రీనివాస్ ఏకపక్షధోరణి పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన నాయకులు పిఠాపురం సమావేశంలో కుర్చీలతో కొట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కొత్తగా జనసేనకు తలనొప్పులు ప్రారంభమయ్యాయి.
కాగా రెండు రోజుల క్రితం పిఠాపురంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు జనసేనలో కలవరాన్ని పుట్టిస్తున్నాయి. జనసేన ఇంచార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ స్థానికేతుడు అంటూ ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. తంగేళ్ల అనుచరులు దీనిపై మండిపడుతున్నప్పటికీ ఆయన వ్యతిరేకవర్గం మాత్రం హర్షం వ్యక్తం చేస్తోంది. అయ్యన్నపాత్రుడు నిజమే చెప్పాడని వారు వ్యాఖ్యనిస్తున్నారు. జనసేన రెండో వర్గం అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను సమర్ధించడం మరో వివాదాస్పదమైంది.




Total views : 78994