అయ్యప్పస్వామి భక్తులకు గుడ్ న్యూస్

Ayyappaswamy devotees

Advertisements

&NewLine;<p>శబరిమలలో అయ్యప్పస్వామి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది&period; శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని గంటసేపు పొడిగించింది&period; ప్రస్తుతం ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు&period; ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి&period; రోజూ వర్చువల్‌ క్యూ ద్వారా 90వేల బుకింగ్‌లు&comma; స్పాట్‌లో 30వేల బుకింగ్స్‌ ఉంటున్నాయని ఆలయ అధికారులు తెలిపారు&period; చిన్నారులు&comma; మహిళలు&comma; వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు&period; స్వామి వారి దర్శనం కోసం భక్తులకు సగటున 14 గంటల టైం పడుతోంది&period; అయితే క్యూ కాంప్లెక్స్‌లో తగిన సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; దీంతో దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచినీరు&comma; బిస్కెట్లను అందజేస్తామని ఆలయ అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …