91
ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించడాన్ని ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమానికి అంగన్వాడి అనుబంధ సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో ఫైర్ స్టేషన్ సెంటర్ లో అంగన్వాడీ మహిళలు బైటాయించి ఆందోళన చేపట్టారు. ఆందోళన చేస్తున్న సమయంలో అంగన్వాడీ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీలను అడ్డుకునేందుకు ఎక్కువ సంఖ్యలో పోలీసులు మోహరించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు టీడీపీ జనసేన వామపక్ష పార్టీలు సంఘీభావం తెలిపాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే అంగన్వాడీలు మొత్తం సీఎం జగన్ ప్యాలెస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.