138
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి… ఏలూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి… సంక్రాంతి ముగ్గుల పోటీలు, చిన్నారులకు భోగి పళ్ళు, బొమ్మల కొలువు చూపులను ఆకట్టుకున్నాయి.. గాలిపటాలు ఎగరవేస్తూ భోగి మంటలు చుట్టూ డ్యాన్స్ లు చేస్తూ విద్యార్థులు సందడి చేశారు… సంక్రాంతి అంటే రైతుల పండుగ అని పూర్వం నుంచి వస్తున్న ఆచారం అని సంక్రాంతి మూడు రోజులు రకరకాల పిండి వంటలతో, కొత్త బట్టలు ధరించి బంధుమిత్రులతో ఎంతో ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటామని నగర వాసులు తెలుపుతున్నారు.