కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు

KCR

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది&period; అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్&comma; ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది&period; తదుపరి విచారణను మరో పిటిషన్ తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది&period; ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కిచెప్పింది&period; కోకాపేటలో సర్వే నెం&period; 239&comma; 240 బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది&period; ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు&period; చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించి కేసీఆర్ పై కేసు నమోదు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..