- భారీగా నమోదవుతున్న పగటి ఉష్ణోగ్రతలు
- మరి.. ఎన్నికల వేళ ప్రచారం ఎలా సాగుతోంది?
- పగటివేళ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు?
- ఎన్నికల ప్రచారం చేసే సమయం మార్చేశారా?
- పెరిగిన ఎండలు, పార్టీల ప్రచారంపై మీరేం చెబుతారు?
- పార్టీల ప్రచారంపై ఎండ ప్రతాపం
- భగభగ మండుతున్న భానుడితో అవస్థలు
- ఎన్నికల ముంగిట ఎండ తీవ్రతతో తలనొప్పులు
- మండుతున్న ఎండలతో కార్యకర్తల బెంబేలు
- బయటకు వచ్చేందుకు భయపడుతున్న నేతలు, శ్రేణులు
- ఎండవేడిమి నేపథ్యంలో ప్రచారం స్టైల్ మార్చిన పార్టీలు
- ఉదయం 6 నుంచి పది గంటల వరకు ప్రచారం
- సాయంత్రం 4 తరువాత ప్రచారానికి మొగ్గు చూపుతున్న వైనం
- సాయంత్రం వేళల్లోనే సభలు, సమావేశాలు
- కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థుల ప్రచారం
- తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
- రెండు దశాబ్దాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలంటోన్న ఐఎండీ
- నంద్యాల జిల్లాలో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఏపీలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- తెలంగాణలో 10 జిల్లాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీలు
- పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, ఖమ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు
- తెలంగాణలోని పలు జిల్లాల్లో 455.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
- తెలంగాణలో వడదెబ్బతో ఆరుగురు మృత్యువాత
- ఆంధ్రప్రదేశ్లో వడదెబ్బ ధాటికి ముగ్గురు దుర్మరణం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రతాపం చూపుతున్న వడగాలులు
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సార్వత్రిక ఎన్నికలు సహా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీల ప్రచారంపై ఎండ ప్రతాపం చూపిస్తోంది. భగభగ మండుతున్న భానుడితో అవస్థలు తప్పడం లేదు. ఎన్నికల ముంగిట ఎండ తీవ్రతతో రాజకీయ పార్టీల నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మండుతున్న ఎండలతో కార్యకర్తలు బెంబేలెత్తిపోతున్నారు. పగటివేళ బయటకు వచ్చేందుకు కూడా రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు భయపడుతున్నారు.
ఈ ప్రచండ భానుడి ప్రతాపం నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు చాలాచోట్ల ప్రచారంలో స్టైల్ మార్చేశారు. ఉదయం 6 గంటల నుంచే ప్రచారం మొదలుపెడుతున్నారు. ఉదయం పది గంటల వరకు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం సమయంలో ప్రచారానికి విరామం ఇస్తున్నారు. మళ్లీ సాయంత్రం 4 గంటల తరువాత ప్రచారానికి మొగ్గు చూపుతున్నారు. రాత్రి వరకూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక, సభలు, సమావేశాలు దాదాపుగా సాయంత్రం వేళల్లోనే ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రం తతప్పనిసరి పరిస్థితుల్లో అభ్యర్థులు మండుటెండల్లోనూ ప్రచారం చేయాల్సి వస్తోందంటున్నారు.
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటుతున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక.. శుక్రవారం ఎండతీవ్రత చూసుకుంటే.. నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో అత్యధికంగా 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. చాలా జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, విజయనగరం, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి.
ఇటు.. తెలంగాణలో చూస్తే.. వరుసగా నాలుగో రోజు కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 46 డిగ్రీలు దాటిపోయాయి. 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిల, పెద్దపల్లి జిల్లా మంథని, సూర్యాపేట జిల్లా మునగాల లో 46.7 డిగ్రీల ఎండ తీవ్రత నమోదయ్యింది. అలాగే, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, నిర్మల్, మహబూబ్నగర్, మేడ్చల్ ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, మల్కాజిగిరి, నిజామాబాద్ జిల్లాల్లో 45.2 డిగ్రీల నుంచి 45.8 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇక, వడదెబ్బ ధాటికి తెలంగాణలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో వడదెబ్బకు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇక, తెలుగు రాష్ట్రాల్లో పగటివేళ వడగాలులు కూడా ప్రతాపం చూపుతున్నాయి.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేతపల్నాడు జిల్లాలో కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రిని మూసేశారు. గురజాల నియోజకవర్గం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని లాలా బజారులో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రానికి కరెంటు బిల్లు కట్టలేదనే సాకుతో మూసీవేశారు.గత వైసీపీ హయాంలో సుమారు…
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్ఏపీలో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్ శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22 వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలిస్తారు.…
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాంఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని…