దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ లబ్ధిని అందించడంతో పాటు మొత్తం పెన్షన్ దారులు కూడా మన రాష్ట్రంలోనే అత్యధికమని వనిత అన్నారు. సోమవారం నాడు కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతనంగా మంజూరైన 220 మంది పెన్షన్ దారులకు 6 లక్షల 60 వేల రూపాయల పెన్షన్ ను హోంమంత్రి స్వహాస్తాలతో అందజేశారు. దీంతో కొవ్వూరు రూరల్ మండలంలో పెన్షన్లు 10266 నుండి 10,438కి పెరిగాయి. వైఎస్సార్ పెన్షన్ కానుక క్రింద పెన్షన్ల ఖర్చు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల తొంబై తొమ్మిది వేల రూపాయలకు పెరిగింది. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… కొవ్వూరు నియోజకవర్గంలో ఈ ఒక్క నెలలోనే 620 మందికి నూతన పెన్షన్లు అందజేశామన్నారు. చాగల్లు మండలంలో 126 మందికి, తాళ్లపూడి మండలంలో 189 మందికి, కోవ్వూరు టౌన్ లో 85 మందికి, కొవ్వూరు రూరల్ మండలంలో 220 మందికి నూతన పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. ఈ జనవరి నెల నుండి కొవ్వూరు నియోజకవర్గంలో మొత్తం 32,298 మందికి 9 కోట్ల 48 లక్షల 32 వేల 500 రూపాయలను ప్రతి నెలా అందజేస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి పెన్షన్ ఇంటి వద్దకే అందజేయడం జరుగుతుందన్నారు.
పింఛన్ల పెంపు కార్యక్రమంలో హోమ్ మినిస్టర్…
58
previous post