103
ఒరిస్సా నుంచి ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్న 220 కిలోల గంజాయిని సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ వద్ద పట్టుకున్నట్లు మెదక్ డివిజన్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ముత్తంగి నుంచి మహేంద్ర ఎక్స్ యు వి 500 వాహనంలో గంజాయిని తరలిస్తున్న డ్రైవర్ చంద్రకాంత్ అనే వ్యక్తిని పట్టుకొని విచారించగా పూర్తి వివరాలు వెల్లడైనట్లు తెలిపారు. మహారాష్ట్ర సతార్ జిల్లాకు చెందిన విశాల్ దిలీప్ అనే వ్యక్తి గంజాయి సరఫరాకు సూత్రధారి అని తేలినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.