రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శంకర్పల్లి చౌరస్తా లో పూర్తి ఇన్ఫర్మేషన్ తో చేవెళ్ల పోలీసులు మరియు స్పెషల్ పోలీసులు కలిసి 32 బ్యాగుల్లో 64 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఇందులో 32 బ్యాగులను రెండు మొబైల్ లను సీజ్ చేయడం జరిగింది. నలుగురు వ్యక్తులు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ వెళ్లి చూడగా 32 బ్యాగులుల్లో గంజాయి దొరకడం జరిగింది దీని విలువ సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
ఇందులో ముగ్గురు మగవారు ఒక ఆడమనిషి ఉన్నారని మగవారిలో ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ గంజాయిని ఒరిస్సా ప్రాంతం నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ గంజాయి తరలించడంలో ఎలాంటి సొంత వాహనం వాడకుండా ఒరిస్సా నుంచి లారీలు ఎక్కుకుంటూ చివరకు చేవెళ్ల చౌరస్తాకు చేరుకుని అక్కడి నుంచి సంగారెడ్డి వెళ్ళడానికి లారీలను అపుతున్న క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు వెల్లి పట్టుకోవడం జరిగింది.
ఇందులో గంజాయి తరలిస్తున్న వ్యక్తులు 1. చిత్ర కైలాస్ మోహిత్ (35), w. నవనత్ గణపత్ చౌహాన్ (70), 3. మదన్ బాల సాహెబ్ బయాస్ (38), 4. రాజేష్ సుభాష్ మోహిత్ (15) గా గుర్తించారు. ఇందులో విశేషమేమంటే నిందితుడిగా 15 సంవత్సరాల మైనర్ రాజేష్ సుభాష్ మోహిత్ ఉండడం. గంజాయి నీ ఒరిస్సా నుండి మహారాష్ట్రకు తరలిస్తున్నారు.
చేవెళ్ల లో భారీ గంజాయి పట్టివేత…
80
previous post