172
నెల్లూరు జిల్లాలో వైసీపీ నుండి టీడీపీ లోకి భారీ చేరికలు జరిగాయి. కందుకూరు నియోజకవర్గం పలుకూరు గ్రామం ఎస్సి కాలనీ చెందిన వైసీపీ నాయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరావు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్బంగా ఇంటూరి నాగేశ్వరావు పార్టీ కార్యాలయం లో వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీ లోకి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా వుంటానని కష్టానష్టాల్లో మీకు తోడుగా వుంటానని, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చిన నా ఇంటి తలుపు తడితే వెంటనే స్పందిస్తానని వారికి హామీ ఇచ్చారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.