వైసీపీ మేనిఫెస్టో(YCP Manifesto)ను విడుదల చేశారు. ఇప్పుడు కూడా సంక్షే పథకాలకు ప్రథాన్యత ఇస్తూ రెండు కీలక హామీలు ఇవ్వనున్నారు. మహిళలు, రైతులను ఆకర్షించే రెండు పథకాలు మేనిఫెస్టోలో ప్రధానంగా హైలెట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే బీసీలను ఆకర్షించేలా ఓ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని హామీలు ఇవ్వకుండా కొద్ది మొత్తంలోనే పథకాలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారని ఆ పార్టీలు నాయకులు చెప్పుకుంటున్నారు.
ఇది చదవండి: మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ సతీమణి శిరీష ప్రచారం..
కేవలం ఓ పాంప్లెట్ సైజులో నవరత్నాలను హైలెట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేయాలని అటు సీఎం జగన్(CM Jagan) సైతం నిర్ణయించారట. ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని పథకాలనూ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారట. మరోసారి అధికారంలోకి వచ్చేలా సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే మేనిఫెస్టో విడుదలపై క్లారిటీ లేదు. విడుదల చేసే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ అధికారికంగా శనివారం విడుదల చేస్తామని చెప్పలేదు. దీంతో మేనిఫెస్టో విడుదలపై కొంత గందరగోళం నెలకొంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. 2025 జనవరి 1 నుంచి 1.82 శాతం…
- ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.