ప్రభుత్వం ఇచ్చిన ఎన్నో చీకటి జీవోలను ఈ రోజు భోగి మంటల్లో కాల్చామని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ రోజు తెనాలిలో ఎర్పాటు చేసిన భోగి వేడుకల్లో పాల్గొని జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ప్లే కార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేసి తగలబెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ భోగి మంటలతో వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిందని అన్నారు. ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. వచ్చే సంవత్సరం టిడిపి అధికారంలోకి వస్తుందని మరింత ఆనందంగా పండుగ జరుపుకుందాం అని తెలిపారు. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు, అమయకులపై దాడులు చంద్రబాబు గారి కుటుంబాన్ని వేధించిందని అవన్నీ ఈ భోగిమంటల్లో పోవాలని టిడిపి అధికారంలోకి రావాలని కోరుతున్నామని అన్నారు.
ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా…
70
previous post