ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు….

chandrababu

Advertisements

&NewLine;<p>మిచాంగ్ తుఫాన్ వలన జరిగిన నష్టాన్ని గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు&period; మిచాంగ్ తుఫాన్ తో కనీవినీ ఎరుగని నష్టం జరిగిందని&comma; ప్రభుత్వ వైఫల్యం వల్ల 15 జిల్లాల్లో 22 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు&period; ముందస్తుగా తుఫాన్ హెచ్చరికలు చేసినా ప్రభుత్వం శ్రద్ద తీసుకోలేదని&comma; పట్టిసీమను వాడుకోవడం వల్ల తుఫాన్ ల కంటే ముందుగానే పంట చేతికొచ్చేదని ఆయన మండిపడ్డారు&period; పట్టిసీమ&comma; పులిచింతల ను పట్టించుకోలేదని&comma; వైసీపీ వచ్చిన తర్వాత ఇరిగేషన్ ను నాశనం చేశారని అన్నారు&period; డ్రెయిన్ ల పూసికతీత తీయకపోవడం తో పొలాల్లో నీరు బయటకు వెళ్ళలేదని సీఎం&comma; మంత్రులు తుఫాను పై స్పందించడం లేదని ఆయన ఎద్దేవా చేసారు&period; తుఫాన్ నష్టంపై రైతులకు భరోసా ఇవ్వడం లో ప్రభుత్వం ఫెయిల్ అయిందని కరువు&comma; తుఫాన్ నష్టంపై కేంద్రాన్ని ఒక్క రూపాయి కూడా అడగలేదని అన్నారు&period; నా రాజకీయ చరిత్రలో చూడనంత నష్టం జరిగిందని బాధితులకు న్యాయం చేసేవరకూ టీడీపీ తరపున పోరాడతానని ఆయన అన్నారు&period; కరువు&comma; తుఫాన్ నష్టంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాన్నారు&period; వచ్చేది రైతు ప్రభుత్వమని&comma; రైతులను ఆదుకుంటామని&comma; అంగన్వాడీల న్యాయమైన పోరాటానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు&period; నా 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వాన్ని బూతులు తిడుతున్నారని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్