టాలీవుడ్ డ్రగ్స్ కేసులో.. కోర్టు సంచలన తీర్పు

Puri Jagannath and Tarun,

Advertisements

&NewLine;<p>టాలీవుడ్ లో కొన్నాళ్ల కిందట రేగిన డ్రగ్స్ కలకలం తాలూకూ ప్రకంపనలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి&period; ఈ అంశానికి సంబంధించి నమోదు చేసిన ఎనిమిది కేసుల్లో 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది&period; అప్పట్లో టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే&period; నెలల తరబడి టాలీవుడ్ ప్రముఖులను విచారించారు&period; ఈ కేసులో మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టి&comma; నటి రకుల్ ప్రీత్ సింగ్ కు నోటీసులు కూడా జారీ చేసింది&period; పూరీ జగన్నాథ్&comma; తరుణ్&comma; చార్మీ తదితరులు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు&period; పలువురు నటులు నుంచి గోర్లు&comma; తల వెంట్రుకలు కూడా సేకరించిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది&period; ఈ నేపథ్యంలో&comma; ఫోరెన్సిక్ నివేదిక&comma; సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి కోర్టు ఆరు కేసుల్లో సరైన ఆధారాలు&comma; సాక్ష్యాలు లేవంటూ కేసులు కొట్టివేసింది&period; డ్రగ్స్ కేసు విచారణలో సరైన విధానం పాటించలేదని న్యాయస్థానం అభిప్రాయపడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..