టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు :
నాపై నమ్మకంతో తెలుగుదేశం – బిజెపి – జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు నారా చంద్రబాబు నాయుడు కి, నారా లోకేష్ కి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చంనాయుడు కి కృతజ్ఞతలు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో కందుకూరు ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీకి గిఫ్ట్ గా అందిస్తాను. వైసిపి పరిపాలనతో ప్రజలు ఇప్పటికే విసుగు చెందారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కేవలం చంద్రబాబు నాయుడు వల్ల మాత్రమే అని నమ్మి ఈసారి టిడిపికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఓడిపోబోతున్నాడు. కందుకూరులో పాతికేళ్ల తర్వాత భారీ విజయం సాధించబోతున్నాం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
కందుకూరు నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే నా మొదటి లక్ష్యం. అలాగే రాళ్లపాడు రిజర్వాయర్ రైతులకు సాగునీరు సకాలంలో అందించడం, రామాయపట్నం పోర్టు నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెడతాను. కందుకూరును రోల్ మోడల్ గా తీర్చిదిద్దేలా, ప్రజలందరూ మెచ్చేలా పరిపాలన చేస్తానని మాట ఇస్తున్నా. కందుకూరుకు కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి శాంతిభద్రతల గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలు మానుకుంటే మంచిది. కందుకూరులో శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వను. ఆ విషయంలో గ్యారెంటీ నాది.
నాకు ఇన్చార్జ్ పదవి రావడంలో, తాజాగా అభ్యర్థి ప్రకటన విషయంలోనూ సహాయ సహకారాలు అందించిన డాక్టర్ దివి శివరాం కి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన శివరాం , పోతుల రామారావు , ఇతర సీనియర్ నాయకుల సలహాలతో ముందుకు వెళతా. టికెట్ కోసం పోటీపడ్డ నా సోదరుడు ఇంటూరి రాజేష్ తో కూడా మాట్లాడతాను. రాజేష్ కూడా పార్టీ కోసమే కష్టపడుతున్నాడు. ఇద్దరం కలిసి త్వరలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం. ఈరోజు కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి