శుక్రవారం పార్లమెంటులో ఎంపీల సస్పెన్షన్ ను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు అని, పార్లమెంటు భద్రతా వైఫల్యాల చర్చకు తావివ్వకుండా సభ్యులను సస్పెన్షన్ చేసి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం ప్రవర్తిస్తుందన్నారు. పార్లమెంటులోకి చోచ్చుకొని వచ్చిన అగాంతకులు బిజెపి పార్టీకి సంబంధించిన వారేనని విమర్శించారు. ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడడంతోనే బిజెపి పీఠాలు కదులుతున్నాయని మండిపడ్డారు. సెంటిమెంటును అడ్డుపెట్టుకొని ఎన్నికలకు వచ్చి గెలవడం బిజెపికి ఆనవాయితీగా మారిందని ఎద్దేవా చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా బిజెపి అనైతిక చర్యలకు పాల్పడుతుందని, సేవ్ డెమోక్రసీ సేవ్ ఇండియా అనే నినాదంతో ఇండియా కూటమి ప్రజల ముందుకు వెళుతుందని, విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైందన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా బిజెపి చేస్తున్న చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలు రెండు ఒకటేనని, బిజెపి చేసిన చర్యను అందుకే బిఆర్ఎస్ ఖండించలేదన్నారు. ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, మహిళా నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య చరిత్రలో ఇది ఒక చీకటి రోజు….
74
previous post