నవరత్నాలు – పేదలందరికి ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు కాసు. మహేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాసుకి లబ్ధిదారులైన మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కాసు దాచేపల్లి పట్టణ పరిధిలో నూతనంగా 1300 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. త్వరలోనే ఇళ్ల నిర్మాణానికి అవసరమయ్యే నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని పట్టణంలో సొంత ఇల్లు లేని వారికి కచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇస్తామని వారు తెలిపారు. కులం, మతం రాజకీయం కాదు, మీకు మంచి చేసామా లేదా అని ఆలోచించండి అని అన్నారు. పని చేసే ఎమ్మెల్యే కావాలా లేదా పనికిమాలిన ఎమ్మెల్యే కావాలా అని అలోచించి రానున్న ఎన్నికలలో ఓటేయండి అని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. చరిత్ర సృష్టించాలన్న, దాన్ని తిరగరాయాలన్న అది ఒక్క ఆంధ్ర రాష్ట్ర అక్క చెల్లెమ్మలకే సాధ్యం అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గురజాల ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధిస్తానని ఎమ్మెల్యే కాసు ధీమా వ్యక్తం చేశారు.
ఎవరిని ఎం చేయాలన్న వాళ్ళ ఒక్కరికే సాధ్యం…
69
previous post