చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీ కృష్ణ మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వంశీకి ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి సారధ్యంలో ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని పేర్కొన్నారు. రేపు జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీకి కార్మికులంతా ఓటు వేసి భారీ మెజార్టీతో గుర్తింపు సంఘంగా గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, INTUC యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం….
117
previous post