63
వైసీపీ నియంతృత్వ పాలనపై ప్రజలు విసిగిపోయి టీడీపీ- జనసేనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని నరసాపురం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరు రామరాజు తెలిపారు. అద్భుతమైన రాజధానిని నిర్మించాలనే లక్ష్యంతో చంద్రబాబు.. ప్రజలకు 33 శాతం ఇచ్చే ఒప్పందంలో 33 వేల ఎకరాలు సేకరించారన్నారు. సిఎం జగన్ ఉద్దేశపూర్వకంగా అక్రమకేసులు బనాయించారని మండిపడ్డారు. వైసీపీ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, రాబోయే రోజుల్లో జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఐదేళ్ల పాలనపై ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ – జనసేనలో టిక్కెట్ ఎవరికీ ఇచ్చినా విజయానికి కృషి చేస్తామని రామరాజు స్పష్టం చేశారు.