85
విశాఖలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన కొనసాగుతోంది. నేడు జనసేన నేతలతో విడివిడిగా పవన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల కార్యాచరణపై ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై నేతలతో పవన్ కల్యాణ్ చర్చించనున్నారు. ఆదివారం రాత్రి నోవోటెల్‌లో పార్టీ నేతలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు వర్తమాన రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.