మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో జెండా ఊపి జయహో బీసీ రథాలను మాజీమంత్రి కొల్లు రవీంద్ర, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ, తెదేపా బిసి నాయకులు ముందుకు పంపించారు. అనంతరం మాజీ మాత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజలను మరోసారి చైతన్య వంతులుగా చేసేందుకే జయహో బీసీ కార్యక్రమమని ఆయన అన్నారు. జయహో బీసీ కార్యక్రమం ద్వారా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీలకు చేయబోయే కార్యక్రమాలను వివరించడంతో ప్రజలు వారికి అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. జగన్ ని తరిమికొట్టడం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని, జగన్ ఓటమికి సిద్ధమయ్యాడని అన్నారు. జగన్ చెస్ గేమ్ ఆడుతున్న అనుకుంటున్నాడు కానీ తను ఆడుతుంది వైకుంఠపాళీ అని అతనికి తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్ల ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పావులుగా వాడుకున్నాడని, బీసీలు పక్కన పెట్టాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులను మారుస్తున్నట్టు MLA లను పక్క నియోజకవర్గాలకు జగన్ బదిలీ చేస్తున్నాడని అన్నారు. MLA క్యాండెట్స్ మార్చడం కాదు ముందు జగన్ ని మార్చాలని, సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లోకి వెళుతున్నామని ఆయన అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, టీడీపీ వచ్చాక మళ్ళి పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని అన్నారు. బీసీలకు జగన్ అన్ని రకాలుగా అన్యాయం చేశాడని, లక్షాధికారులను చేస్తానని చెప్పి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. బీసీలను దగా చేస్తున్నాడని, 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నాడని ఆయన జగన్ పై మండిపడ్డారు. ఈ నెల 7 వ తేదీన నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తిరువూరులో రా కదలిరా అనే నినాదంతో భారీ బహిరంగ సభ జరగనున్నది. 18వ తేదీన మచిలీపట్నం పార్లమెంట్, గుడివాడ నియోజకవర్గం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, చిత్తజిల్లు నాగ రాము, అక్కు మహాంతి రాజా, గోపు సత్యనారాయణ, లంకె నారాయణ ప్రసాద్ , పళ్లపాటి సుబ్రమణ్యం , వూకంటి రాంబాబు, లంకే శేషగిరి, తిరుమణి నారాయణ, కాగిత గోపాలరావు, తదితర బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
జయహో బీసీ కార్యక్రమం ద్వారా జైత్రయాత్రకు శ్రీకారం…
164
previous post